7 April, 2026 | 1:56 AM

విలీనం వైపు అడుగులు

07-04-2026 12:00 AM
  1. ఉద్యమానికి సిద్దం అవుతున్న రైతులు

కేటీఆర్ రాక కోసం

కరీంనగర్/సిరిసిల్ల, ఏప్రిల్6 (విజయక్రాంతి):కాంతిపుంజం సిరిసిల్ల సహకార వి ద్యుత్ సరఫరా సంఘానికి చీకట్లు అలుముకున్నాయి. జిల్లాలో ఉన్న విద్యుత్ సమస్యల ను అధిగమించడానికి సిరిసిల్ల ప్రాంత రై తులు, ప్రజలందరూ ఒకటయి. చీకట్లను తరిమివేయడం కోసం సిరిసిల్ల విద్యుత్ సహ కార సరఫరా సంఘాన్ని స్థాపించుకున్నారు.

1969-1970 నుంచి మొదలైన సెస్ ప్రస్థా నం ఐదు దశాబ్దాలకు పైగా వెలుగునీడలను పంచుతూ వస్తున్న సెస్ను ఎన్పీడీసీఎల్లో కలపాలని చూస్తుంది. సిరిసిల్ల విద్యుత్ సహ కార సరఫరా సంఘానికి ప్రభుత్వం విద్యుత్ సరఫరా కోసం ఇచ్చిన లైసెన్స్ను ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు విద్యుత్తు పంపిణీ సంబంధించి ప్రభుత్వం లైసెన్స్ పొడిగిస్తూ రెన్యూవల్ చేస్తుంది.

ఎన్పీడీసీఎల్లో సెస్ను కలపాలనే నిర్ణటించుకొనిఈసారి లైసెన్స్ రెన్యూవల్ చేయకుండాసెస్ పరిధిలో విద్యు త్తు పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం ఎన్పీడీసీఎల్కు అప్పగించింది. ప్రభుత్వం తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు సిరిసిల్ల సెస్ పరిధిలోని విద్యుత్ పంపిణీని పూర్తిగా ఎన్పీడీసీ ఎల్ చూస్తుంది . గత ఆరు రోజులుగా ఎన్పీడీసీఎల్‌అడుగులు చూస్తే విలీనం అయి పోయినట్టే అని భావిస్తున్నారు.

సేవల్లో లోపాలు రాకుండా...

ఎన్పీడీసీఎల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలందించడమే లక్షంగా ఆ రు రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, సి బ్బంది వినియోగదారుల వద్దకు వెళ్లి మంచి సేవలను అందిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 250 విద్యుత్ వ్యవసాయ అవసరాలకు మంజూరు చేశారు. సెస్ గడిచిన ఏడాదిలో 1400 ఇస్తే మరో 2500 వరకు పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన వాటిని ఎక్స్ ప్రెస్ డ్రైవ్ ను చేపట్టి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెలుతున్నారు.

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సిరిసిల్ల మగ్గాల కార్మికులకు విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు ఎంకేటగిరి మూడు కింద బిల్లింగ్ అవుతున్న దానిని, 4ఏ కిందకు మార్చుతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల విద్యు త్ సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట చేపట్టారు. సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నందున సేవల పట్ల పవర్లూమ్ కార్మికులు, రైతులు దగ్గరయ్యేలాప్లాన్ చేసారం. రాజకీయ పార్టీ లు నేతల మధ్య రాజకీయాలే సెస్ బంధం వీడిపోతుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

సిరిసిల్ల సెస్ వినియోగదారులు ఎన్పీడీసీఎల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా సెస్ పరిధిలో విద్యుత్ సరాఫరాను ఎన్పీడీసీల్కు అప్పగించడంతో లాభాల బాటలో పయనిస్తున్న సెస్ను కాపాడుకోవడానికి ఉద్యమాలకు సైతం సిద్ధమవు తున్నారు.బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె టి ఆర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఉద్య మ కార్యాచరణ రూపొందించాలని చూస్తున్నారు.