4 July, 2026 | 11:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

టాలెంట్ టెస్టుల్లో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థుల ప్రతిభ

18-12-2025 12:23 AM

కోదాడ, డిసెంబర్ 17: కోదాడ పట్టణానికి చెందిన ఎస్‌ఆర్‌ఎం స్కూల్ విద్యార్థులు పలు టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ కనబర్చారు. విజేతలను ఎంఈఓ సలీం షరీఫ్ బుధవారం అభినందించారు. కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి మాట్లాడుతూ రామానుజన్ టాలెంట్ టెస్ట్ వారు సూర్యాపేటలో నిర్వహించిన గణిత ప్రతిభా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు సిద్దు, సాయి సంతోష్, హర్షిత్,

అభిషేక్, ఆరాధ్యలు జిల్లా స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించారన్నారు. సూర్యాపేటలో జరిగిన ఏ ఎస్ రావు టాలెంట్ టెస్టులో పి ఆశ్రిత, కారుణ్య శ్రీ, హిమానితారెడ్డిలు ప్రతిభ కనబర్చి సెకండ్ లెవల్ కు అర్హత సాధించారన్నారు. విజేతలకు కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.