2 April, 2026 | 3:27 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

శ్రీరాంతండా సర్పంచి ఏకగ్రీవం!

30-11-2025 10:34 PM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం శ్రీరాంతండా సర్పంచిగా బానోత్ వెంకటేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక, అభివృద్ధికి నోచుకోని తండా, ఈసారి ఎన్నికల ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడిన శ్రీరాంతండా, గత ఐదేండ్లుగా నిరాదరణకు గురైంది. కనీసం వీధి దీపాలు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. దీంతో ఈసారి ఎన్నికల ద్వారా తండాను అభివృద్ధి చేసుకోవాలని తండావాసులు కలిసికట్టుగా నిర్ణయించుకున్నారు.

గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, ఎన్నికల పోటీ లేకుండా అన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  చదువుకున్న యువకుడు బానోతు వెంకటేశ్ ను సర్పంచిగా ఎన్నుకున్నారు. సర్పంచితోపాటు 8 మందిని వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. "గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. పోటీల వల్ల మనస్పర్థలు, డబ్బు ఖర్చు తప్ప, అభివృద్ధి జరగదు. అందుకే ఈసారి చదువుకున్న యువకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం." అని తండావాసులు అన్నారు.

* సంబరాల్లో మునిగిన తండా

ఏకగ్రీవ ఎన్నిక నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం తండావాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కొత్త సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకొని, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచి, వార్డుసభ్యులు తండాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని తండావాసులు గట్టి నమ్మకంతో ఉన్నారు.