ఘనంగా శ్రీపాదరావు జయంతి
సూర్యాపేట, మార్చి 2 (విజయక్రాంతి) : దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతినీ కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, డీవైఎస్‌ఓ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, డిఎంహెచ్వో వెంకటరమణ, డిఎమ్‌ఓ నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.




