3 March, 2026 | 8:13 AM

ఎంఐటీఎస్, స్టాన్లీ కాలేజీల మధ్య ఎంఓయూ

03-03-2026 12:00 AM

అకాడెమిక్ మెరుగుదల,  సంయుక్త పరిశోధన కార్యక్రమాల నిర్వహణకు అంగీకారం

మదనపల్లె, మార్చి2(విజయక్రాంతి): మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఎంఐటీఎస్), డీమ్డ్ టు బీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (ఆటోనమస్) మధ్య అవగాహన ఒప్పందం (ఎం ఓయూ) సోమవారం ఘనంగా జరిగింది.

ఈ అవగాహన ఒప్పందం ద్వారా రెండు విద్యాసంస్థలు అకాడెమిక్ మెరుగుదల, సంయుక్త పరిశోధన కార్యక్రమాలు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు (ఎఫ్‌డీపీలు), పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలు, పారిశ్రామికోత్పత్తి (ఎంట్రప్రెన్యూర్‌షిప్) అభివృద్ధి, దీర్ఘకాలిక అకాడెమిక్ సహకారాన్ని బలోపేతం చేయాల ని నిర్ణయించుకున్నాయి.

అర్హత కలిగిన ఫ్యాక ల్టీ సభ్యులకు పీహెచ్‌డీ ప్రవేశావకాశాలు కల్పించడం, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం కో -సూపర్‌వైజర్లుగా వ్యవహరించే అవకాశాలు కల్పించడం, సంయుక్త పరిశోధన, కన్సల్టెన్సీ కార్యక్రమాలను ప్రోత్సహించ డం వంటి అం శాలు ఈ ఒప్పందంలో ప్రధానంగా ఉన్నాయి.

కార్యక్రమంలో డాక్టర్ ఏ. వినయ బాబు, డీన్, డాక్టర్ వైవీఎస్‌ఎస్ ప్రగతి, డైరెక్టర్, డాక్టర్ జి కార్తిక్ , డైరెక్టర్ (ఆర్‌అండ్‌డీ), ఎ.రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, బీవీ కృష్ణారావు, డాక్టర్ రవీంద్రనాథ్ సి. చెరుకూరి, డీన్ (ఆర్ అండ్‌డీ) మదనపల్లె విశ్వవిద్యాలయంహాజరయ్యారు.

ఈ అవగాహన ఒప్పందం ద్వారా రెండు విద్యాసంస్థల మధ్య పరిశోధన, ఆవిష్కరణ, విద్యార్థి, అధ్యాపక మార్పిడి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయ ని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల కాలపరి మితి గల ఈ ఒప్పందం, రెండు సంస్థ ల అకాడెమిక్, పరిశోధన రంగాల్లో సమగ్ర అభివృ ద్ధికి దోహదం చేస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.