24 August, 2026 | 10:29 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

బీఎస్‌పీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీహరి చారి

23-04-2026 12:54 AM

మేడ్చల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జిగా ముల్లంగిరి శ్రీహరి చారి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అందజేశారు. చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు, రాష్ట్ర కోఆర్డినేటర్ బి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సూచించారు. ఈ సందర్భంగా శ్రీహరి చారి మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియమకానికి కృషిచేసిన రాష్ట్ర అధ్యక్షుడు  శేఖర్, చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్, సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్, రాష్ట్ర కోఆర్డినేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు.