23 April, 2026 | 2:21 AM

ప్రభుత్వ పాఠశాలలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ల వితరణ

23-04-2026 12:53 AM

కాజిపేట్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మరో కీలక అడుగు వేసింది. ఫౌండేషన్ యొక్క సీ ఎస్ ఆర్ చొరవలో భాగంగా కాజిపేట్ మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను అందజేయడం జరిగింది. కాజిపేట్ ఎం ఈ ఓ మనోజ్ కుమార్ సమక్షంలో కంప్యూటర్లను అందజేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వితరణ ఎంతో దోహదపడుతుందని ఎం ఈ ఓ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సేవా కార్యక్రమానికి ప్రత్యేక కృషి చేసిన ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ రాపాక స్వాతి, సీ ఎస్ ఆర్ కోఆర్డినేటర్ నాగరాజు కు మండల విద్యాశాఖ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చూపుతున్న ఈ నిరంతర సహకారం ఆదర్శనీయమని కొనియాడారు.