24 August, 2026 | 11:35 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

పోపా అధ్యక్షుడిగా యోగేశ్వర్ ఎన్నిక

23-04-2026 12:54 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా  పద్మశాలి ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ (పోపా) అధ్యక్షుడిగా రిటైర్డ్ తహసిల్దార్ కూర్మ యోగేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అనుమాల సిద్ధార్థ్ ను నియమిం చారు. బుధవారం అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్ర రావు, సంగారెడ్డి అధ్యక్షులు కొప్పెరి హరి హర కిషన్, కార్యదర్శి సోమ రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పద్మశాలి కుల బాంధవుల ఆలోచనలను వ్యక్తపరుస్తూ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలని పద్మశాలి సంఘం సన్నాహక సమావేశం, మండల కమిటీల ఏర్పాటు ఏకాభిప్రాయంతో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులు అనుమాల వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాల సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నరసయ్య, కోశాధికారి బొమ్మ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాస్, మార్కండేయ గుడి అధ్యక్షులు కైరం కొండ వీరన్న, కూరపాటి ఆదినారాయణ పాల్గొన్నారు.