calender_icon.png 4 February, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేళ్లచెరువు జాతర నిర్వహణకు కోటి మంజూరు

04-02-2026 07:44:19 PM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో  కోటి రూపాయలు నిధులు మంజూరు

దక్షిణ కాశీగా పేరుపొందిన మేళ్లచెరువు శివాలయం

మేళ్లచెరువు,(విజయ క్రాంతి): ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు మేళ్లచెర్వు లోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే మహాశివరాత్రి జాతరకు కోటి రూపాయలు మంజూరయ్యాయి.రాష్ట్ర నీటిపారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో  కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి.

మంజూరు అయిన కోటి రూపాయల నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి విడుదలయ్యాయి.ఉత్తర గోపుర నిర్మాణ పనులు, జాతర నిర్వహణకు వివిధ రకాల ఏర్పాట్లు, జాతరకు వచ్చే  భక్తులకు ఉచిత అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ వారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.