21 April, 2026 | 4:07 PM

మంథనిలో ఘనంగా శ్రీ శంకరాచార్య జయంతి

21-04-2026 02:30 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ శీలేశ్వర  సిద్దేశ్వర స్వామి దేవాలయంలోని శ్రీ ఆది శంకరాచార్య ఆలయంలో మంగళవారం శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం స్వామివారిని పట్టణ పురవీధుల్లో ఉన్న భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఆలయ నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్ ఆలయ పూజారి దహాగం రమేష్ లు కార్యక్రమ ఏర్పాటు పర్యవేక్షించారు.

శ్రీ ఆది శంకరాచార్యుల చరిత్ర : హిందూ భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహా పురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి 2524 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం  509 లో వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర లో సూర్యుడు శని గురువు కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి అనే గ్రామంలో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబు తిరి అని బ్రాహ్మణ వంశంలోని ఆర్యాంబ శివ గురు అనే పుణ్య దంపతులకు శ్రీ ఆదిశంకరాచార్యుడు జన్మించారు.

వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ధర్మం పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుని అంశతో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు అవతరించారు. శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం స్వీకరించి "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని మొదలైన ఇతర శాస్త్రాలను కంఠస్థం చేశారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. దాదాపు 90% ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచిచారు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని, స్వధర్నాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ

వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ధర్మ సంస్థాపన చేశారు. శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని.

ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి క్రీస్తుపూర్వం 477 లో మహా నిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మ సిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవతా విగ్రహాల శక్తిని ఇటువంటి మానవ సమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తధ్యము అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తిచాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. ఘనంగా శ్రీ శంకరాచార్య జయంతి. హిందూ భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు.

శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం స్వీకరించి "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని మొదలైన ఇతర శాస్త్రాలను కంఠస్థం చేసారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు. జ్ఞాన్మ మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానభోధకే పరిమితం కాక, అనేకస్తోత్రాలు అందించారు.

చాతుర్మఠాల -పీఠముల స్థాపన

వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసే విధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను స్థాపించారు.1. దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం. ఇది దక్షిణామ్నాయ మఠమని, శారదా పీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ 2. మఠము స్థాపించబడింది. ఉత్తరమున ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం. జ్యోతిర్మఠముదీనిని ఉత్తరామ్నాయమనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం, పీఠ దేవత నారాయణుడు. 3. తూర్పున పురీలో గోవర్ధన పీఠం. దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గల పూరీ పట్టణంలో స్థాపించబడింది. 4. పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు. ద్వారకా మఠము ఈ మఠము శంకరులచే, దేశానికి పశ్చిమంగా ఉన్నది.

శంకర మఠము కంచికామకోటి పీఠము :సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది. నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు. '’కంచికామకోటి '’ పీఠాన్ని తానే స్వయంగా కొన్ని రోజులు అధిరోహించారు.