ఆర్టీసీ బస్సు లో పొగలు... తప్పిన పెనుప్రమాదం
25-06-2026 11:44 AM
ఆదిలాబాద్, జూన్ 25 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సులో నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికుకు భయాందోళన చెందారు. గురువారం ఆదిలాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఇచ్చోడ మండల సమీపంలోని డోంగర్ గావ్ వద్ద ఒక్కసారిగా బస్సులో నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ను రోడ్డుపైనే నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.






