25 June, 2026 | 12:41 PM

యాదగిరిగుట్టలో నారసింహ స్మరణతో గిరిప్రదక్షిణ

25-06-2026 11:50 AM

గిరి ప్రదక్షిణంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు

వైభవంగా నిత్య కళ్యాణం

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

యాదగిరిగుట్ట, జూన్ 25 (విజయక్రాంతి): కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, పిలిస్తే పలికే  ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని దర్శించుకునేందుకు స్వామి వారి స్వాతీ నక్షత్రం జన్మ నక్షత్రం సందర్భంగా వేలాదిగా భక్తులు వేకువ జామునుండే గిరిప్రదక్షిణంలో పాల్గొన్నారు. గురువారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్టింపజేసిన స్వామివారి పాదాల వద్ద ఆలయ ఈవో భవాని శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి  గిరి ప్రదేశం లో పాల్గొన్నారు.

స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారి ఆలయంలో శతకటాభిషేకం ను పండితులు ఘనంగా నిర్వహించారు.  శాస్త్రోక్తంగా  స్వామివారికి నిత్యారాధనలు జరిగాయి. స్వామివారి నిత్య కళ్యాణం లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.  మొక్కులను చెల్లించిన భక్తులు స్వామివారిని దర్శించుచున్నారు. గిరిప్రదక్షిణ సందర్భంగా కొండ కింద కొండపైన ప్రత్యేక ఏర్పాట్లను  ఆలయ అధికారులు చేశారు.