మంధని-పెద్దపల్లి రహదారిపై విషాదం
ప్రమాదవశాత్తు కారు విద్యుత్ స్తంభానికి ఢీ యువకుడు మృతి
మంధని,జున్25(విజయక్రాంతి): మంథని - పెద్దపల్లి ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... మంథని మండలం అక్కేపల్లి గ్రామానికి చెందిన వేల్పుల తిరుపతి (24) తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, మంథని మండలంలోని పుట్టపాక బస్టాప్ సమీపంలో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మల్లయ్య తెలిపారు.






