25 June, 2026 | 11:53 AM

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

21-04-2026 02:32 PM

ఇచ్చిన మాట ప్రకారం రెండో నెల రూ. లక్ష చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హర్షం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి) : విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సేవలు మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండో నెల జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. లక్ష చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా సోమవారం సాయంత్రం సంఘం సభ్యులకు అందజేశారు.  ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.

అందరూ కలిసి సంక్షేమ నిధిని మరింత బలోపేతం చేసుకుని ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవాలని సంఘం సభ్యులకు సూచించారు. జర్నలిస్టులకు మేలు చేయడమే సంకల్పంగా అడుగులు వేయడం జరుగుతుందని ప్రతి జర్నలిస్టు లకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వాకిట అశోక్, మధుసూదన్ రెడ్డి, జిల్లెల రఘు, జకీ, భాస్కరాచారి,  తిరుపతయ్య, పల్లెమోని యాదయ్య, సతీష్ కుమార్,  రమాకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, పేట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.