కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు సీఎంల భేటీ
కర్ణాటక : తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల(ungabhadra Project New Gates Inauguration) ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(Union Jal Shakti Minister C.R. Patil) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్నాటన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19 గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ సూచనతో రూ. 51 కోట్లతో 33 కొత్త గేట్లు అమర్చారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొనున్నారు.






