25 June, 2026 | 1:50 PM

Breaking News

తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల గురించి మాట్లాడకపోవటం బాధాకరం

21-04-2026 02:24 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ

కోదాడ,(విజయక్రాంతి): జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల గురించి అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు.

మంగళవారం ఆయన కోదాడలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నారు అటువంటి ఉద్యమకారుల రెక్కల కష్టంతో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈరోజు ఒక శాసన సభ్యుడిగా జీతం తీసుకుంటూ ఏ రోజు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ పునరేకికరణ పేరుతో 75  ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు జీవన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకుని ఏదో సాధించినట్లుగా పెద్ద బహిరంగ సభ పెట్టినాడు ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే ఆధ్వర్యంలో ఒక కమిటీ కాలయాపన లేకుండా త్వరగా విధి విధానాలు రూపకల్పన చేసి ఉద్యమకారులకు న్యాయం చేయవలసిందిగా ఆయన కోరినారు.