25 June, 2026 | 12:13 PM

తుమ్మిళ్ల- ఆర్డీఎస్ ఫేజ్ -2 కి మహర్దశ

25-06-2026 11:38 AM

మల్లమ్మ కుంట రిజర్వాయర్ పనులకు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం 

నేడు తనగల గ్రామంలో గ్రామ సభ

గద్వాల్: ఎట్టకేలకు తుమ్మిళ్ల ఆర్డీఎస్ ఫేజ్-2 కి సంబంధించి భూసేకరణ చేపట్టాలని  ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా ఫేజ్ -2 కింద వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నీ నింపేందుకు 567 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్లమ్మ కుంట రిజర్వాయర్ సామర్థ్యం 1.02 టీఎంసీ కెపాసిటీ. ఆర్డీఎస్ కెనాల్ ద్వారా మల్లమ్మ కుంట రిజర్వాయర్ నీ నింపి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఈరోజు గురువారం తనగల గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తుమ్మిళ్ల ఆర్డీఎస్ ఫేజ్ 2 ఆయకట్టు నిర్మించే ప్రక్రియలో భాగంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండవ దశ పనుల కోసం అవసరమైన భూ సేకరణను రైతుల సంప్రదింపుల ద్వారా త్వరగతిన పూర్తి చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రాజెక్టుల ఆలస్యాన్ని సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. తుంగభద్రా నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కర్ణాటక పరిధిలోని హెడ్ వర్క్స్ వివాదాలు గద్వాల జిల్లా పరిధిలోని రిజర్వాయర్ల భూ సేకరణ జాప్యం కారణంగా రైతులకు తీరిన న్యాయం జరుగుతున్నది. ఆర్డీఎస్ నీటిని నిలువ చేసుకొని ఆయకట్టుకు ప్రతిపాదించిన తుమ్మెళ్ళ ఫేజ్ 2 మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది భూసేకరణ ప్రక్రియ మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు.

రైతులకు సరైన పరిహారం పంపిణీ చేయకపోవడం పాలనాపరమైన జాప్యం దేనికి ప్రధాన అడ్డంకిగా మారాయి . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వాసి కావడం ఆయన నియోజకవర్గంలోని కొడంగల్ ఎత్తిపోతల పథకం మరియు మక్తల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ ప్రక్రియలో భాగంగా రైతులకు సరైన న్యాయం జరిగిందని అదేవిధంగా ఇక్కడ కూడా రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేస్తేనే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు శాస్త్ర ఉపశమనం లభిస్తుంది. ఈ విషయంపై జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను వివరణ కోరగా రేపు తనగల గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 567 ఎకరాల భూమిని సేకరించాలని రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని తెలిపారు.