27 April, 2026 | 5:52 PM

శ్రీ భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో పెరిక కులస్తులు పాల్గొనాలి

27-04-2026 04:12 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 29వ తేదీన జరిగే పూజా కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కులస్తులందరూ పాల్గొనాలని ప్రొఫెసర్ వడ్డే రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ వడ్డె రవీందర్ మాట్లాడుతూ... శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ ఉత్సవాలలో భాగంగా జరిగే పూజా కార్యక్రమంలో పెరిక కుల బంధువులు, ప్రత్యేక పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, అందులో భాగంగా ఈనెల 29వ తేదీన పెరక కుల సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ వడ్డే రవీందర్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెరిక కులస్తులు అంతా పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.