calender_icon.png 6 February, 2026 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శాంక్టస్’ స్కూల్‌లో క్రీడోత్సవం

06-02-2026 12:53:45 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): శాంక్టస్ వరల్డ్ స్కూల్ తన చరిత్రలో తొలిసారిగా నిర్వహించిన వార్షిక క్రీడోత్సవం సినెర్జి 2025 షాంషాబాద్, బి.ఎన్. రెడ్డి క్యాంపస్లలో నిర్వహించి మరో మైలురాయిని నెలకొల్పింది. ఇరవైకి పైగా ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలతో ఈ క్రీడోత్సవం సాగింది. ట్రాక్ అండ్ ఫీల్ ఈవెంట్లు, చెస్, కరాటే, క్రికెట్, ఫిట్నెస్ ఆధారిత పోటీ లు అన్ని వయసు వర్గాల విద్యార్థులను ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేశాయి.

క్రమబద్ధమైన మార్చ్ పాస్ట్, యోగా ప్రదర్శనలు, సమన్వయ డ్రిల్లులు విద్యార్థుల శిక్షణా క్రమశిక్షణను ప్రతిబింబించగా, హౌస్ వారీ పోటీ లు క్రీడాస్ఫూర్తి, ఐక్యతను పెంపొందించాయి. ఫిన్నిష్ అకాడమిక్ సహకారంతో కూడిన సీబీఎస్‌ఈ పాఠశాలగా గ్లోబల్ విద్యా ప్రమాణాలను బలమైన సహపాఠ్య కార్యక్రమాలతో సమన్వయం చేయడం ఈ క్రీడోత్సవంలో స్పష్టంగా కనిపించింది. ఈ క్రీడోత్సవం సీఎండీ డి. రాజేశ్వర్‌రెడ్డి దృష్టి తో డైరెక్టర్ డి. హారితరెడ్డి అకాడమిక్ నాయకత్వంలో నిర్వహించబడింది. సీఎండీ విజేత లకు బహుమతులు అందజేశారు.