calender_icon.png 6 February, 2026 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు కొనసాగుతున్న భూ కబ్జా

06-02-2026 12:54:34 AM

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఓవైపు ఎన్నికలు ప్రచారం ఊపందుకోగా మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులు వారి అనుచరులు భూకబ్జాలకు మళ్ళీ తెర లేపుతున్నారు. ప్రభుత్వ భూములు కుంటలను వాటి పక్కనే పట్టా భూములను కొనుగోలు చేసి ఉండగా ప్రభుత్వ భూములు సైతం మాదేనంటూ పాగా వేస్తున్నారు.

సరిగ్గా అధికారులు, నేతలు అంతా ప్రచారంలో మునిగి తేలుతుండగా భూ కబ్జా రాయుళ్ళు మాత్రం రాత్రికి రాత్రి భారీ హిటాచీలు జెసిబిల సహాయంతో ఎర్రమట్టి గుట్టలను తోలిచి ఆ మట్టిని ప్రభుత్వ భూముల్లో పోసి చదును చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలోని సర్వే నంబర్ 7లో, భీమారం శివారులో ని చిన్నపాటి నీటి కుంటలను ఎర్రమట్టితో చదును చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.