calender_icon.png 6 February, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పని ఖతం.. బీజేపీతోనే భవిష్యత్

06-02-2026 12:53:13 AM

ఎంపీ డి కే.అరుణ

నారాయణపేట ఫిబ్రవరి,5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని బిజెపి తోనే భవిష్యత్తు అని పాలమూరు ఎంపీ డి కే అరుణ అన్నారు.గురువారం నా రాయణపేట జిల్లాలో మద్దూరు,నారాయణపేట మున్సిపాలిటీలో నిర్వహించిన రోడ్ షో లు సక్సె స్ అయ్యాయి.రోడ్డు షోలో ఎంపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నదని రాష్ట్రంలో గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు.

అ ధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావచ్చిన ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. నారాయణపేట,మద్దూర్ పట్టణాలు అభివృద్ధి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు వేస్తే తప్ప అభివృద్ధి కా ద న్నారు. బీజేపీ నీ గెలిపిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుందము అభివృద్ధి చేసుకుందామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పైసా లేదు.వృద్ధులకు 4వేల పెన్షన్ అన్నారు రాలేదు.

18 ఏళ్లు దాటిన మహిళలకు 2500 రూపాయలు ఇప్పటికి ఇవ్వడం లేదు అని దెప్పి పొడిచారు.ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే.. కాంగ్రెస్ కి ఓటువేయాలని భయపెడుతున్నారనీ ఆరోపించారు.ఎన్ని ప్రజలను సార్లు మోసం చేస్తారనీ ప్రశ్నించారు.సీఎం అయితే పాలమూరు బాగుపడు తుందని ఎమ్మెల్యేలను గెలిపించారు రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందనీ నిలదీశారు.కేసీఆర్ అప్పులు చేసి పోయాడు..

ఖజానా ఖాళీ అయ్యిందని చెబుతు న్నారు.ఎన్నికల ముం దు రాష్ట్ర ఆర్థిక పరిస్తితి తెలియ దా..?అని ప్రశ్నించారు. కాంగ్రె స్ జుటా మాటలు నమ్మకండి అని..బీజేపీ అప్పుడే చెప్పిందన్నారు.కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటు వేస్తే.. ప్రజలను చేశారనీ విమర్శించారు.కేంద్ర ప్రభు త్వం తక్కువ వడ్డీకి చిరు వ్యాపారులకు రుణాలు అందజేస్తుందనీ ఉపాధి కల్పించిందన్నారు.మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంద న్నారు.

ఊర్లలోహిందూ,ముస్లిం బేధాలు ఉండవు.. అంద రం ఒక్కటే అనే భావ నలో మనం ఉంటాంకానీ రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందనీ విమర్శించారు.అఖండ భార తదేశంలో హిందూ, ముస్లిం,క్రిస్టియన్, సిక్కు అందరూ ఒక్కటే అని ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృ ద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందనీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేస్తుందన్నారు.

నారాయణపేట మద్దూర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు.కేంద్రం నిధులతో డ్రైనేజీ,సీసీ రోడ్లు అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఎవరు ఆపలేరన్నారు.అభివృద్ధి కి ఎంపీగా అండగా నిలుస్తా నని భరోసా ఇచ్చారు.బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.రోడ్ షో లో కర్ణాటక సేడం మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్,బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ,రతంగ్ పాండురెడ్డి,ప్రతాప్ రెడ్డి,జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ్ జిల్లా,పట్టణ నాయకులు,బిజెపి అభ్యర్థులు పాల్గొన్నారు.