విద్యార్థులకు ఆట పరికరాలు అందజేత
బేల,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం ఈ అవసరాన్ని గుర్తించి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గణేష్ పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆట పరికరాలను అందజేశారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేసి వారు మాట్లాడారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
వాటిని దృష్టిలో ఉంచుకొని ఆదివాసి గ్రామాలలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సహాయ సహకార అందించి క్రీడల్లో ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచిన విద్యార్థుల మేధాశక్తి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుందని చదువుపై కూడా ఆ ఉత్సాహం ఉపయోగపడుతుందని తెలియజేశారు. రానున్న రోజుల్లోనే విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలు అందించేందుకు తాను ముందుంటారని తెలియజేశారు. ఇందులో గ్రామ సర్పంచ్ టేకం నాగరావు, టిచర్ రాజు, మాజీ సర్పంచ్ టేకం బాపురావు, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, యువ నాయకులు నాయన్, మంచికంటి నవనీత్, స్వప్నిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వామన్ తదితరులు ఉన్నారు.






