పచ్చదనంతోనే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్, ఆగస్టు 25: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... అడవులు, పచ్చని వాతావరణం భావితరాల ఆరోగ్యానికి ఎంతో కీలకమని అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు అర్బన్ ఫారెస్ట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. మన కోసం మాత్రమే కాదు.. భావితరాల కోసం మొక్కలు నాటి సంరక్షిద్దాం. పర్యావరణాన్ని కాపాడుతూ నర్సాపూర్ను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేయాలి అని ఎమ్మెల్యే అన్నారు.కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఎఫ్‌ఆర్‌ఓ దివ్య, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరాం సింగ్, సెక్షన్ ఆఫీసర్ సాయిరాం బిఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.






