12 August, 2026 | 11:15 PM

ఇల్లంతకుంట ఫ్యాక్స్ చైర్మన్ గా రమణ రెడ్డి

12-08-2026 09:55 PM

కాంగ్రెస్ శ్రేణుల హర్షం

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): ఇల్లంతకుంట మండల ఫ్యాక్స్ చైర్మన్ గా ఊట్కూరి వెంకట రమణ రెడ్డి ని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది, గతంలో ఎన్నికలు నిర్వహించి చైర్మన్ ను ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం చైర్మన్ తో పాటు పాలకవర్గంను కూడా నామినేటెడ్ పద్దతిలో నియమిస్తుంది.

అందులో భాగంగానే సోమరాంపేట గ్రామానికి చెందిన రమణ రెడ్డి ని ఫ్యాక్స్ చైర్మన్ గా నియంచింది. గతంలో సెస్ డైరెక్టర్ గా, ఎంపీపీ గా ఇల్లంతకుంట మండలనికి సేవాలు అందించిన రమణారెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ గా నియామకం కావడంతో తో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు, తన నియామకానికి సహకరించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు, కాంగ్రెస్ శ్రేణులకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.