రేపు రైతులకు సాగుపై శిక్షణ
12-08-2026 10:05 PM
కంగ్టి,(విజయక్రాంతి): జంగి రైతు వేదికలో రేపు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ నిర్వహించనున్నారు.ఆత్మ (ATM) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త శ్రీ రమేష్ రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించనున్నారు. నేచురల్ ఫార్మింగ్, నానో యూరియా, నానో డీఏపీ, హెచ్‌డీ కాటన్, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేసే నూనెగింజల పంటలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్ కోరారు.






