12 August, 2026 | 11:03 PM

మున్సిపల్ కౌన్సిలర్ జన్మదిన సందర్బంగా అల్పాహార కార్యక్రమం

12-08-2026 09:51 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో  మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు,అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు షేక్ యూసఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 నుంచి 300 మంది ప్రజలకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ... లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, తన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ప్రజలకు అల్పాహారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ సభ్యులు మరింత ప్రోత్సహిస్తూ కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్లు బట్టు మధు, చల్ల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, కోశాధికారి సైదులు నాయక్, ఉపాధ్యక్షులు గుండ సత్యనారాయణ, బాల వెంకటేశ్వర్లు, జీఎంటి కోఆర్డినేటర్ చిత్ర విశ్వనాథ్, అడ్వైజర్ కొప్పున లక్ష్మీనారాయణ గౌడ్, సభ్యులు శ్రీనివాసరావు, గంధం శావయ్య, కొనతం ఆదిరెడ్డి, రూపవతి, బాలు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.