సహ చట్టం సాధన సమితి కమిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి
సహ చట్టం సాధన సమితి కమిటీ జిల్లా అధ్యక్షులు తోట సురేష్
జిల్లా కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సాధన సమితి కమిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని సహ చట్టం సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు తోట సురేష్ అన్నారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆర్టీఐ 2005 జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి సూచన మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో సమాచార హక్కు చట్టం 2005 సమగ్రంగా అమలు కోసం, జిల్లా సమాచార హక్కు చట్టం కమిటీ ఏర్పాటు కోసం జిల్లాస్థాయి మానిటరింగ్ సభ్యుల ఏర్పాటు వ్యవస్థ పునరుద్దరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార సాధన హక్కు చట్టం కమిటీకి 33 మంది ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని, రాష్టంలోని ప్రతి జిల్లాలోని సమాచారం హక్కు చట్టం సాధన సమితి 3 మంది సభ్యులకు ప్రాతిపదికన కల్పించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సమాచార కమిషన్ కు తమ సమాచార హక్కు చట్టం సాధన కమిటీని సిఫార్సు చేయవలెనని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రఘపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి, మారెల్లి కిరణ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ రావుల రమేష్, బద్రి, హరిబాబు, జిల్లా కన్వీనర్ కాసాని దేవేందర్, కో ఆర్డినేటర్ రాజశేఖర్, భూపాలపల్లి మండల అధ్యక్షులు శివప్రసాద్, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.






