7 August, 2026 | 4:25 PM

అలుగుపడిన ఇల్లందులపాడు చెరువు.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

07-08-2026 03:21 PM

ఇల్లందు టౌన్, ఆగస్టు 7 (విజయక్రాంతి): భారీ వర్షాలతో ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు మంచినీటి చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగుపడటంతో రెండో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ఆధ్వర్యంలో గురువారం చెరువు మత్తడి వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర, సారె, జాకెట్, పూలు, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డ కిరణ్ మిత్ర మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోరం కనకయ్య నాయకత్వంలో ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 35 వేల మందికి తాగునీటిని అందించే ఇల్లందులపాడు చెరువు నిండిపోవడం ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయమన్నారు. చెరువులు, కుంటలు నిండిపోవడం రైతులకు, ప్రజలకు శుభసూచకమని, భవిష్యత్తులో కూడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. యాకూబ్, ప్రధాన కార్యదర్శి నేలమర్రి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు చెన్నమల రామకృష్ణ, మేకల శ్యామ్ మాదిగ, సుఖాంత్ మిత్ర, మలిపెద్ది కమలాకర్, ఎస్.కే. సలీం, తుపాకుల సైదులు, కొత్తపల్లి నవతేజ, పదమటి చంటి, దొడ్డ బాబీ, ధర్మల స్రవంతి, గుడి పూజారి ఓం భాయ్, రాంబాయి, కొండపల్లి సంపత్, నుంచి శ్రీనివాస్, బొల్లినేని నాగరాజు, ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.