7 August, 2026 | 4:09 PM

చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం

07-08-2026 03:19 PM

బిజెపి జిల్లా అధ్యక్షులు మల్లేశం, మేయర్ కొలగాని 

ముకరంపుర, ఆగస్టు 7(విజయక్రాంతి): చేనేత కార్మికులకు అండగా నిలుస్తామని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ 39వ డివిజన్ లోని చేనేత సహకార సంఘం  కార్యాలయం వద్ద  జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ వేడుకలకు బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం , నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు .ఈ సందర్భంగా సాయిని మల్లేశం , కోలగాని శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి, చేనేత ఉత్పత్తుల కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు  మార్కెటింగ్ కల్పించడం కోసం  ఆగస్టు 7 తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత అధ్యక్షులు, డైరెక్టర్లు, సంఘ సభ్యులను ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్ర శేఖర్, తెళ్ళ రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, సరస్వతి సత్యం, గుంజెటి మెతుకు సత్యం, శివన్న, అడిచర్ల రాజు, సతీష్, మునిందర్ లు పాల్గొన్నారు.