పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఉద్యమ పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 07 (వికాయక్రాంతి) : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం అని ఎం ఆర్ పీ ఎస్, ఎం ఎస్ పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి మడిపల్లి శ్యాం బాబు మాదిగ అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం సాధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎం ఆర్ పీ ఎస్, ఎంఎస్పీ భూపాలపల్లి మండల ఇంచార్జి దోర్నాల రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్యాంబాబు ముఖ్య అతిధిగా హాజరై కేకు కట్ చేశారు.
ఈ సందర్భంగా శ్యాం బాబు మాట్లాడుతూ నిరుపేద గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ 2004 సంవత్సరంలో చేసిన నిరవధిక దీక్ష పోరాట పలితంగానే లక్షలాది మంది చిన్నపిల్లకు ఉచిత శాస్త్ర చికిత్సలు చేయించడంతో పాటు ఆరోగ్య శ్రీ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ ఉద్యమాలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు సాధించి పెట్టిన ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదిగకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.






