24 July, 2026 | 9:38 PM

శ్రీ సాంబశివ దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు

24-07-2026 08:22 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గల  శ్రీ సాంబశివ దేవాలయం లో మంగళహారతుల తో పెద్ద ఎత్తున మహిళ లు వారాహి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే  గోరింటాకు వేడుకల ను ఘనంగా జరుపుకున్నారు, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ  మహిళలచే పూజ లు చేయించారు, ఈ కార్యక్రమం లో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.