24 July, 2026 | 10:23 PM

ఎట్టకేలకు సోనాల ఆసుపత్రి డిప్యూటేషన్ రద్దు.

24-07-2026 09:27 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో. విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నవీన్ రెడ్డి డిప్యూటేషన్ ఎట్టకేలకు రద్దయింది. గతంలో వారానికి రెండుసార్లు బజార్హత్నూర్ ఆసుపత్రికి వెళ్లి విధులు నిర్వహించేవారు. అయితే జిల్లా అధికారులు ఇటీవల ఆయనను పూర్తిస్థాయి డిప్యూటేషన్ పై బజార్హత్నూర్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ గాజుల పోతన డిప్యూటేషన్ రద్దు చేయాలని జిల్లా వైద్యాధికారికి విన్నవించడం జరిగింది. దీంతో జిల్లా అధికారులు డాక్టర్ నవీన్ రెడ్డి డిప్యూటేషన్ రద్దు చేసి యధావిధిగా సోనాల ఆసుపత్రికి పూర్తిస్థాయి వైద్యునిగా పంపించారు.