మహిళ సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించిన వారిపై చర్యలు తప్పవు
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మహిళా సంఘాల రుణాలు సక్రమంగా చెల్లించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా ఐకెపి అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు.స్వయం సహాయక సంఘాలు మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఐకెపి అదనపూర్ డిఆర్డిఓ విజయలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లి, గోపాల్పేట్, విజయసాయి గ్రామ సంఘాలలో నిర్వహించిన ప్రత్యేక రికవరీ డ్రైవ్లో పాల్గొన్నారు. మండలంలో ఎన్.పి.ఏ తగ్గించేందుకు మహిళా సంఘాలు మరియు గ్రామ పెద్దలు సహకారాన్ని కోరారు.
అదేవిధంగా మహిళలకు రుణ రికవరీ చెల్లింపు పై అవగాహన కల్పించడంతోపాటు రుణాలు సక్రమంగా చెల్లించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కావున మండలంలోని అన్ని గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు మహిళలు తీసుకున్న రుణాల బాకీలు వెంటనే చెల్లించి ఆదర్శవంతమైన మండలంలో తీర్చి దిద్దినందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు.తర్వాత నాగిరెడ్డిపేట మండలంలో స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టు కార్యక్రమాన్ని సందర్శించారు.






