24 July, 2026 | 10:23 PM

రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బోనగిరి మహేష్

24-07-2026 09:25 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగిరి మహేష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొర్ర సురేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బోనగిరి మహేష్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం, సంస్థ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.