24 July, 2026 | 9:49 PM

విజ్ఞానవంతులు ప్రశ్నిస్తే దేశద్రోహులా

24-07-2026 09:17 PM

* విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన ప్రజా కళాకారుడు బాదె నర్సయ్య 

గరిడేపల్లి,(విజయక్రాంతి): విద్యావంతులు విద్యార్థులు ప్రశ్నిస్తే దేశద్రోహుల టెర్రరిస్టుల ముద్రలు వేసి విచక్షణ రహితంగా పోలీసులతో లాటి చార్జి చేయడం బాధాకరమని ప్రజా కళాకారుడు బాదె నర్సయ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి కి నిరసనగా మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ప్రధాన రహదారి సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ... విద్యార్థులపై లాఠీ చార్జి చేయడం వాటర్ ప్రూఫ్, ఇయర్ గ్యాస్ ఉపయోగించి రక్తాలు కారేటట్లు కొట్టడం అమానుష్యం అని కేంద్ర ప్రభుత్వాని హెచ్చరించారు. ప్రభుత్వాలు తప్పులు చేస్తే నిరసనలు తెలియజేయడం ఇది భారతీయుల హక్కు అని అన్నారు. విద్యావంతులను రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. విద్యార్థులకు ఉన్న ఇబ్బందులపై తన పాట ఆట ద్వారా ప్రజలకు తెలియజేశారు.