21 August, 2026 | 12:39 AM

దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య న్యాయ ప్రచార ఉద్యమం

21-08-2026 12:03 AM
  1. ఈనెల 31న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా..
  2. వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పన ఇమామ్ దార్ 

ముషీరాబాద్,ఆగస్టు 20 (విజయక్రాంతి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన కుల గణనలో ఓబీసీ కాలం ను చేర్చాలని లోక్ ఆందోళన్  న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పనా ఇనామ్ దార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ  మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలన్నారు. డీ లిమిటేషన్ ప్రక్రియ పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యాయవ్యవస్థలో సంస్కరణలను తీసుకురావాలన్నారు. ప్రాంతీయ భాషలకు అన్ని రాష్ట్రాల హై కోర్టుల్లో ప్రాధాన్యతనివ్వాలన్నారు. న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 31వ తేదీన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో  న్యాయవాది శిల్ప పవార్, రాఘవ లింగం తదితరులు పాల్గొన్నారు.