16 August, 2026 | 11:10 PM

వీరభద్రేశ్వర ఆలయంలో విశేష పూజలు

16-08-2026 09:14 PM

సదాశివ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి లో వీరభద్రేశ్వరాలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శివ తెలిపారు. మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.