16 August, 2026 | 9:48 PM

కలెక్టరేట్లో రేపటి ప్రజావాణి రద్దు

16-08-2026 09:21 PM

నర్సాపూర్ ఆగస్టు 16: సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం (ఆగస్టు 17) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కలెక్టరేట్‌ ప్రజావాణి హాల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు కార్యక్రమ ఏర్పాట్లలో విధుల్లో నిమగ్నమై ఉండటంతో కలెక్టరేట్‌ ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.