16 August, 2026 | 11:16 PM

నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం

16-08-2026 09:23 PM

​నర్సాపూర్: నర్సాపూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ పరమేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.

​ప్రయాణ మార్గం: ఈ బస్సు నర్సాపూర్ నుంచి బయలుదేరి మంగళపర్తి, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంటుంది.

​నర్సాపూర్ నుండి సమయం: ప్రతిరోజూ ఉదయం 7:00 గంటలకు నర్సాపూర్ ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరి, ఉదయం 11:30 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటుంది.​ తిరుగు ప్రయాణం: యాదగిరిగుట్ట నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5:00 గంటలకు తిరిగి నర్సాపూర్ చేరుకుంటుంది.​ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఈ నూతన బస్సు సర్వీసును వినియోగించుకోవాలని మేనేజర్ కోరారు.