పోచారం ప్రాజెక్టుకు పర్యటకుల సందడి
నాగిరెడ్డిపేట్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టుకు పర్యటకుల సందడితో కళకళలాడింది.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టు గత నెల రోజుల నుండి పొంగిపొర్లడంతో శనివారం ఆదివారం సెలవు దినం కావడంతో జనాలు గుంపులు గుంపులుగా ప్రాజెక్టును సందర్శించారు.
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగునుండి పొంగిపొరడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి దూర ప్రాంతాలైనటువంటి కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల నుండి జనాలు తండోపతండాలుగా తరలివస్తు ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఆలుగు పైనుండి దూకే జలధారతో స్నానాలు చేయడం, ఈత కొడుతూ సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా పోచారం ప్రాజెక్టు ప్రాంతాన్ని చూస్తూ సంతోషంగా గడిపారు. పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున ప్రాజెక్టును సందర్శించి సెలవు దినములు సంతోషంగా గడిపారు.






