16 August, 2026 | 10:17 PM

బాల్య మిత్రుడి కుటుంబానికి తోటి స్నేహితుల ఆర్థిక సహకారం...

16-08-2026 09:13 PM

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గ ఫారం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం నస్రుల్లభాద్ మండలం దుర్కి X రోడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన వారికి మేము అండగా ఉన్నామంటూ పోతంగల్ గ్రామానికి చెందిన 2001-02 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు అందరు కలిసి 40,000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతలే రమేష్, పబ్బ శేఖర్, B.సాయిలు, కిరణ్ ,సుధాకర్ రెడ్డి, సలీం,రషీద్, సజ్జత్, మహేష్ , లింగురం, సంతోష్, గంగాధర్, మిత్రులు ఉన్నారు.