పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి, జూలై 29 (విజయక్రాంతి): ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ సూచించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో 5.8 లక్షలతో అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.
వార్డులలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దండు రాజేశ్వర్, ప్రశాంత్, చాకలి అశోక్, నాయకులు పాండురంగారెడ్డి, పార్శి బాలకృష్ణ, గుండ శేఖర్, మాశెట్టి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.






