17 April, 2026 | 9:34 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

17-04-2026 07:55 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి):  రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఆర్ సి ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనo నడిపే వాహనదారులు హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే అనుకోకుండా జరిగే ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.

గత ఏడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో సుమారు 350 మంది మృతి చెందగా వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించని వారే ఉన్నారని తెలిపారు. హెల్మెట్ ధరించని వారిపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే తక్షణమే 100, 108 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట సమయమును గోల్డెన్ అవర్ అంటారు ఈ సమయంలో బాధితులకు తక్షణమే వైద్యం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

ప్రమాదం జరిగిన బాధితులను నిమిషాలలోనే ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా మొదటిసారి 25000 రెండోసారి 50,000 మూడోసారి ఒక లక్ష వరకు రివార్డు అందిస్తారని తెలిపారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురి అవ్వడంతో వెంటనే స్పందించి బాధితున్ని ఆస్పత్రికి తీసుకుపోయిన వెంకన్న అనే వ్యక్తికి 25 వేల పరిహారం అందిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతున్నందున ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

రోడ్డు ప్రమాదంలో బాధితులకు సహాయం అందించడంలో పోలీస్ కేసులు అవుతాయని భయపడుతున్న ప్రజలకు పోలీసు యంత్రాంగం భరోసా కల్పించాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణం నలుమూలల హైవేలపై, వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందున వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సిఐ నాగభూషణ్, టూ టౌన్ సీఐ సోమ నరసయ్య, రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్, ఎస్సైలు మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరు సుధా బాలు, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్,, ఆర్టీసీ డి ఎం, వైద్యాధికారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు