17 April, 2026 | 9:25 PM

Breaking News

పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

17-04-2026 07:47 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్  బిమ్లా నాయక్ కు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ నిర్ణయానుసారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖమర్ (టీజీజేఏసీ) కొమురం భీం జిల్లా కో చైర్మన్ మాట్లాడుతూ పిఆర్సి కమిషన్ రిపోర్ట్ తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలి.

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల మంజూరు చేయాలని,  కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని (సీపీస్) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని (ఒపీస్) పునరుద్ధరణ చేయాలని, 01/09/2004  కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (ఒపీస్ ) ను అమలు చేయాలని, మిగిలిన దీర్ఘకాలికంగా ఉన్న (64) అంశాలలో పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో మినహాజ్, అలీ,పునేష్, డోంగ్రే సంతోష్,శ్యాం, కవిత,జ్యోతి, రమేష్ బాబు,అనసూయా ,తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.