సమస్యలను పరిష్కరించండి
తీన్మార్ మల్లన్నకు చీకటి మామిడి సర్పంచ్, వార్డు సభ్యుల వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): చీకటి మామిడి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యు లు, గ్రామస్థులు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమ స్యలను వివరించారు. గ్రామ అభివృద్ధి, మౌలి క సదుపాయాల కొరత, తాగునీటి సమస్య, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యా ఆరోగ్య సదుపాయాల మెరుగుదల వంటి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉపాధి అవకాశాల కొరత, యువతకు అవసరమైన సదుపాయాల లేమి గురించి వివరిం చారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పోరాడతామని, అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి విషయాలను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తిరుమణి నాగరాజు గౌడ్, వార్డు సభ్యులు తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్పీలో చేరికలు
హుజురాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి జగన్ మంగళవారం టీ ఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. 10 ఏండ్లు బీఆర్‌ఎస్ పార్టీ కోసం పని చేస్తే అగ్రవర్ణ నాయకులు పట్టించుకోలేదని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీల కోసం పుట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్లు తెలిపారు.
టీఆర్పీ కో- ఆర్డినేటర్‌గా లింగం యాదవ్
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయ కో -ఆర్డినేటర్‌గా బట్టమేకల లింగం యాదవ్‌ణు పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నియమించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్‌గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు బయ్యా వెంకటేష్ యాదవ్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.




