దేశంలోని కోటి కుటుంబాలకు సౌర విద్యుత్
ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ సిస్టం
పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ ఆగస్టు 25 (విజయక్రాంతి): పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించడం, తద్వారా కర్బన ఉద్ఘరాలు,వాతావరణ కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జైవిక్ కంపెనీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడానికి మారుతి ఏజెన్సీస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
మారుతి ఏజెన్సీస్ ని ర్వాహకుడు తిప్పారపు ఆంజనేయులు, ఆ సంస్థ ప్రతినిధులు దేవోజు వెంకటరమణాచారి, తిప్పారపు రవివర్మ లతో కలసి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం పోస్టర్లను మంగళవారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2027 మార్చి నాటికి దేశంలోని కోటి కుటుంబాలకు సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నదని తెలిపారు.






