26 August, 2026 | 3:48 AM

వేదాలు, యజ్ఞాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలి

26-08-2026 02:15 AM

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లేడు చౌదరి గూడ ఆర్య సమాజ్ కార్యాలయంలో నిర్వహించిన 47వ శ్రావణ వేద ప్ర చార సత్సంగం, యజ్ఞంలో మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ... మహర్షి దయానంద సరస్వతి ఆశయ సాధనకు ఆర్య సమాజ్ చేస్తున్న సేవలను అభినందించారు.

యజ్ఞాల ద్వారా ఆధ్యాత్మికత, ఐక్యత పెరుగుతాయని, వేదాలు-యాగాల ప్రాముఖ్యతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అ ందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద శాస్త్రి, డా. వసుధా శాస్త్రి, విఠల్ రావు ఆర్య, మచ్చ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.