26 August, 2026 | 3:47 AM

షాద్‌నగర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనిల్ కుమార్

26-08-2026 02:14 AM

షాద్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): షాద్నగర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గుండాల అనిల్ కుమార్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అనిల్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనిల్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ రాష్ట్ర యువ నేత వందేమోహన్ ముదిరాజ్ సహకారంతో తనకు ఈ పదవి లభించిందని ఈ సందర్భంగా ఆయనతోపాటు ఎమ్మెల్యేకు అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, యువతను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, ఇన్చార్జి సంతోష్ గౌడ్, నందిగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ చారి, గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుండాల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.