19 June, 2026 | 6:24 PM

టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన

19-06-2026 05:01 PM

జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రాజశేఖర్

​పెద్దపల్లి,(విజయక్రాంతి): ​జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

​ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడంతో పాటు, ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, 10వ తరగతి, ఇంటర్మీడియట్ , డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని, అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలని, ​ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 22, ఉదయం 10:00 గంటలకు టాస్క్ ప్రాంతీయ కేంద్రం, పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్ బస్ డిపో ప్రాంగణం పక్కన  హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 9154909057, 9959892960 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.