బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పేర్కొన్నారు. రాహుల్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ గాంధీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తన స్వరం వినిపిస్తూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు.






